తెలుగు సినీ పరిశ్రమలో బాలీవుడ్ హీరోయిన్స్ జోరు పెరిగిపోయింది. కైరాదత్, నిధి అగర్వాల్, శ్రద్ధాకపూర్ భారీ సినిమాలు చేస్తున్నారిప్పుడు.
వీళ్లే కాదు, తమన్నా బాలీవుడ్ నుండే వచ్చింది. కాజల్ బాలీవుడ్ నుండే వచ్చింది. తాప్సీ కావచ్చు, మరొకరు కావచ్చు. ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే, తెలుగు సినీ పరిశ్రమలో బాలీవుడ్ గ్లామర్ ఎప్పుడూ ఎక్కువే. తెలుగమ్మాయిలకే తెలుగు సినిమాల్లో ఛాన్సులివ్వాలని శ్రీరెడ్డి ఆందోళనలు చేస్తోంది. ఆమె బాధని ఎవ్వరూ కొట్టిపారేయలేకపోతున్నారు.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటీనటుల మీద ఆశక్తి బాగా ఎక్కువైపోయింది. మరి శ్రీరెడ్డి డిమాండ్ నేపథ్యంలో టాలీవుడ్‌లోకి వస్తున్న బాలీవుడ్ భామలు ఆశలు వదిలేసుకోవల్సిందేనా? అనే ప్రశ్న వస్తోంది. అయితే మన తెలుగు నటుడు జగపతిబాబు తమిళంలోనూ, మలయాళంలోనూ నటించాడు. చిరంజీవి బాలీవుడ్‌కెళ్లాడు. డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్‌లో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. రానాకి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. రమ్యకృష్ణ, రాధిక తదితరులు బాలీవుడ్‌ని చక్కబెట్టి వచ్చినవారే. అందాల తార జయప్రద అచ్చమైన తెలుగమ్మాయి. కానీ బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగారు.
సో తాజాగా శ్రీరెడ్డి చేపట్టిన ఈ ఆందోళన, పోరాటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంతే.