వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని సౌందర్యం ఆమె సొంతం. అందుకే లేటు వయసులోనూ హాట్ అప్పీల్ ఏమాత్రం వదులుకోవడంలేదు. ఆమె అందాల సుందరి, అతిలోక సుందరి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అప్పటినుంచి ఇప్పటిదాకా అందంలో ఆమెకు పోటీ ఇంకెవరూ లేరంటారు ఆమె అభిమానులు.
ఇక్కడ అభిమానులంటే అందులో స్టార్ హీరోలున్నారు, దర్శక నిర్మాతలున్నారు. అదీ ఆమె ప్రత్యేకత. పెళ్ళయ్యాక, పిల్లలకు జన్మనిచ్చాక సినిమా కెరీర్‌కి కొంత దూరమైన శ్రీదేవి, రీ-ఎంట్రీ తర్వాత విలక్షణ సినిమాలు చేస్తూ వస్తోంది. తన కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేస్తోన్న శ్రీదేవి ఇంకోపక్క తాను కూడా సినిమాల్లో నటించేందుకు ఏమాత్రం వెనుకాడ్డంలేదు. కూతురి కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటూ, తాను కూడా నటిగా కెరీర్‌లో కొనసాగుతుండడం గొప్ప విషయం.
ఇదివరకటితో పోల్చితే బాలీవుడ్‌కి సంబంధించిన ఈవెంట్స్‌లో ఎక్కడా ఆమె మిస్ కాకుండా జాగ్రత్తపడ్తోంది. అలా బాలీవుడ్‌కి చెందిన ఓ పార్టీలో తన భర్తతో కలిసి శ్రీదేవి ఇలా దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీదేవి అప్పీయరెన్స్‌తో నేటితరం అందాల భామలు కూడా ఆశ్చర్యపోయారట. ఈ వయసులోనూ ఇంత అందంగా ఎలా ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారంటూ శ్రీదేవి చుట్టూ చేరిన ఈ తరం హీరోయిన్లు, శ్రీదేవిని ప్రశ్నలతో ముంచెత్తేశారట. శ్రీదేవి నుంచి కొన్ని బ్యూటీ టిప్స్‌ని కూడా వారు తెలుసుకున్నారట.
ఏం చేసినా శ్రీదేవిలా ఫిట్‌గా, గ్లామరస్‌గా ఆ వయసులో ఉండడం కష్టమని ఆ ఫంక్షన్‌లో ఆమెను కలిసిన హీరోయిన్లు చెబుతున్నారు. అందుకే శ్రీదేవి అతిలోక సుందరి అయ్యింది. పై ఫొటోలో శ్రీదేవి గ్లామర్ చూస్తే ఎవరైనా ఆ మాట ఒప్పుకోవాల్సిందే.