అగ్ర దర్శకుల సినిమా అంటే కనీసం యేడాది పట్టేస్తుంది. ఎంత స్పీడ్‌గా తీసినా.. మినిమం తొమ్మిది నెలలైనా ఆ సినిమా సెట్స్‌లో ఉండాల్సిందే. సుకుమార్ లాంటి పర్‌ఫెక్షనిస్టులైతే తీసిందే తీసి... సినిమాని శిల్పంలా చెక్కుతుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడకపోవడం, బెటర్ మెంట్స్... వల్ల సినిమా ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకే సుక్కు సినిమా అంటే దాదాపు యేడాది అని ఫిక్సయిపోవాల్సిందే. అయితే రామ్ చరణ్ సినిమాని మాత్రం నాలుగంటే నాలుగు నెలల్లో పూర్తి చేస్తార్ట. చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 20 నుంచి పట్టాలెక్కబోతోంది. జులై నాటికి సినిమా పూర్తయిపోతుందని చిత్ర బృందం ప్రకటించేసింది. అంటే నాలుగంటే నాలుగు నెలల్లో చరణ్ సినిమాని ఫినిష్ చేస్తారన్నమాట. కాస్త పిరియాడికల్ టచ్ ఉన్న సినిమా ఇది. సెల్ ఫోన్‌లు పెద్దగా ప్రాచుర్యం లేని వాతావరణాన్ని ఈ సినిమా కోసం సృష్టించాలి. ఇలాంటి సినిమాలు కాస్త టైమ్ తీసుకొంటాయి. పైగా సుకుమార్ దర్శకుడాయె. ఆయన సినిమా అంటే మినిమం ఏడాది గ్యారెంటీ. అయితే ఈ సినిమాని నాలుగు నెలల్లో పూర్తి చేయాలనుకోవడం విచిత్రమే. మరి సుక్కు ఈ మ్యాజిక్ చేసేస్తాడా?? జులై నాటికి షూటింగ్‌కి పేకప్ చెప్పేస్తారా?? ఇదే జరిగితే అద్భుతం అనుకోవాలంతే.