మాటల మాంత్రికుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి మంచి పేరుంది. దర్శకుడిగానూ తన సత్తా చూపించాడు. అయితే త్రివిక్రమ్‌కి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమాతో కెరీర్లో ఎప్పుడూ ఊహించని దెబ్బ పడింది 'అజ్ఞాతవాసి' సినిమాతో. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా డిప్రెషన్‌కి లోనయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుండి కోలుకుంటున్నా, 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ అతన్ని వెంటాడుతూనే ఉంది.
లక్కీగా 'అజ్ఞాతవాసి' టైంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి కమిట్ అవ్వడం ఓ రకంగా త్రివిక్రమ్‌కి ప్లస్ అని చెప్పొచ్చు. లేదంటే, 'అజ్ఞాతవాసి' ఇచ్చిన షాక్‌కి ఇప్పట్లో తేరుకోలేకపోయేవాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపైనే తన ఫోకస్ మ్తొం అంటున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి, త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలనే కసితో ఉన్నాడట త్రివిక్రమ్. దాంతో ఫుల్‌గా కాన్సన్ట్రేషన్ చేశాడట ఈ సినిమాపై.
ముందుగా అనుకున్న స్క్రిప్టులోని కొన్ని మార్పులు చేర్పులు చేసి, పవర్ఫుల్ స్క్రిప్టుని ప్రిపేర్ చేశాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అంతేకాదు, ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ ఎక్కువ టైం కూడా తీసుకోదలచుకోలేదట. వీలైనంత త్వరలో పర్ఫెక్ట్గా ఈ సినిమాని తెరకెక్కించే యోచనలో ఉన్నాడట. అందుకే సెట్స్ మీదికెళ్లడం లేటైనా, వెళ్లాక, నిర్విరామంగా షూటింగ్ జరపాలని నిశ్చయించుకున్నాడట.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం న్యూ గెటప్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇంతకు ముందెన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌లోకి ఎన్టీఆర్‌ని మార్చేయనున్నాడట త్రివిక్రమ్. ఆల్రెడీ స్క్రిప్టు పనులన్నీ ప్రిపేర్ చేసి పెట్టాడట. ఇక ఎన్టీఆర్‌దే లేటు. ఎన్టీఆర్ ఓకే అంటే, ఈ సినిమా సెట్స్ మీదికెళ్లడమే తరువాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది.