కొన్ని రకాల గాసిప్స్, రూమర్స్ సెలబ్రిటీస్‌కి కొన్ని సందర్భాల్లో ప్లస్‌లూ, మైనస్‌లు అవుతుంటాయి. ప్లస్ అయితే ఓకే. కానీ మైనస్ అయితేనే కాస్త ఇబ్బంది. అలాంటి సందర్భాల్లో వారు ఇన్ టైంలో స్పందించి, వాటిని ఖండించడమో, లేక సర్ది చెప్పడమో చేస్తే ఫర్వాలేదు. కానీ పట్టించుకోకుండా ఊరుకుంటేనే కూసింత తంటా తప్పదండోయ్. ప్రస్తుతం సాయి పల్లవి విషయంలో అదే జరుగుతోంది.
యాక్టింగ్ టాలెంట్‌తో అన్ని వర్గాల ఆడియన్స్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంటోన్న సాయి పల్లవిని గాసిప్స్ ఇరకాటంలో పెట్టేలానే ఉన్నాయి. ఇంతవరకూ ఏ హీరోయిన్ పైనా రానన్ని గాసిప్స్ ఈ ముద్దుగుమ్మ విషయంలో చక్కర్లు కొడుతున్నాయి. అయినా కానీ సాయి పల్లవి తనకేం పట్టనట్లు ఊరుకుంటోంది. దాంతో ఈ గాసిప్స్‌కి హద్దుల్లేకుండా పోతున్నాయి. ఇటీవల 'కణం' సినిమా ఆడియో రిలీజ్ టైంలో నాగశౌర్య ఆమెపై చేసిన హాట్ కామెంట్స్ సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందు 'ఎంసీఏ' టైంలో కూడా ఈ భామపై అలాంటి గాసిప్సే వచ్చాయి.
తాజాగా ఓ తమిళ చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుండి సాయి పల్లవిని తొలగించేశారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికంతటికీ కారణం ఆమె బిహేవియర్ అంటూ ప్రచారం జరుగుతోంది. వేరే గాసిప్స్ అయితే మరేం ఫర్వాలేదు. కానీ సాయి పల్లవి చుట్టూ చక్కర్లు కొడుతున్న గాసిప్స్ చాలా ప్రమాదకరమైనవి.
కానీ ఎందుకని పల్లవి ఈ గాసిప్స్‌ని పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. ఒప్పుకున్న సినిమా నుండి ఓ హీరోయిన్‌ని తొలగించేశారట అనే ప్రచారం ఆమె కెరీర్‌కి అంత మంచిది కాదు. మరి ఇప్పటికైనా తనపై వస్తున్న ఈ అనవసర గాసిప్స్‌పై సాయి పల్లవి స్పందిస్తుందా? లేదా అనేది వేచి చూడాలిక.