ప్రేమా గీమా జాన్తా నై' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బ్యూటీ మనారా చోప్రా. అంతకు ముందు బార్బీ హండా లనీ, బార్బీ చోప్రా అనీ తనకున్న పేర్లను మార్చుకుని కొత్తగా అవకాశాల కోసం ట్రై చేసింది. అలా ఆమె చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఆమెకు ఉపయోగపడ్డాయి. హిట్లు లేకపోయినా మనారా తెలుగు సినీ పరిశ్రమతో బంధం తెంచుకోలేదు. ప్రయత్నాలు చేసీ చేసి చివరికి పూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఛాన్స్ రావడం కన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప కదా. ఈ బ్యూటీ 'రోగ్'లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. గ్లామర్ పండించింది, పెర్ఫామెన్స్‌తో మనసు దోచింది. అందుకే మనారా చోప్రా గ్లామర్ గురించీ, నటన గురించీ తెలుగు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మనారా కేవలం గ్లామర్ డాళ్‌గానే కాకుండా పర్‌ఫామెన్స్ దిశగా తన టాలెంట్ ప్రదర్శించింది. ఈ సినిమాలో మనారా సింగర్ పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించింది అనడం కన్నా జీవించింది అంటేనే సరిపోతుంది. అలాగే గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం మొహమాట పడకుండా నటించింది. ఇదే టాలెంట్ కంటిన్యూ చేస్తే, అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలకు లోటే ఉండదనిపిస్తోంది. అలాగే మంచి అవకాశాలొస్తే మనారా హీరోయిన్‌గా దూసుకుపోతుందనడం నిస్సందేహం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.