'బాహుబలి' సినిమాకి వరుస రికార్డులు నమోదు అవుతున్నాయి. ఒకదానికి మించిన రికార్డు మరోటి. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వసూళ్ల లెక్కే. ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షేకింగ్ మామూలుగా లేదు. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. తక్కువ సమయంలో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు దాటేసి, సరికొత్త రికార్డుల్ని నమోదు చేసింది. ఇక వసూళ్ల పరంగా 'బాహుబలి' సినిమానే నెంబర్ వన్ అని తేలిపోయింది ఈ రోజుతో. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' మూవీనే ఇంతవరకూ వసూళ్ల పరంగా నెంబర్ వన్ రేంజ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డుని 'బాహుబలి' సినిమా బ్రేక్ చేసేసింది. ఇది అత్యంత గొప్ప రికార్డుగా భావించాలి. ఓ తెలుగు సినిమా ఇంతటి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. గత శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుండి వసూళ్లలో రాకెట్ స్పీడుతో దూసుళ్లిపోతోంది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి'కి దక్కుతున్న ప్రశంసలు అమోఘం, అద్వితీయం. మన తెలుగు సినిమా దేశంలో నెంబర్ వన్ వసూళ్ళు సాధించిన సినిమా అనే మాటే చెప్పుకోడానికి తెలుగువారందరిలోనూ ఆనందం ఉప్పొంగుతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినీ వర్గాలు డిక్లేర్ చేయడం మన మరింతగా గర్వపడాల్సిన అంశం.