ఓ చిన్న సినిమాకి పబ్లిసిటీ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆ సినిమా ఎక్కువమందికి రీచ్ అవుతుంది. సినిమాలో కంటెంట్ ఉంటే, చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుందని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఏ సినిమాకి అయినా పబ్లిసిటీ అవసరం. ఆ పబ్లిసిటీ చేయకపోతే ఒక్కోసారి మంచి సినిమాలు కూడా 'కిల్' అయిపోవడం జరుగుతుంటుంది. అందుకే 'బాబు బాగా బిజీ' సినిమాకి పబ్లిసిటీ చాలా చాలా గట్టిగా చేస్తున్నారు. ఎంత గట్టిగా అంటే ఇటీవలి కాలంలో ఏ చిన్న సినిమాకీ చేయనంతగా. రేపే ఈ సినిమా విడుదల కానుంది. ఇదో అడల్ట్ రేటెడ్ కంటెంట్ ఉన్న సినిమా అనే ప్రచారం ఎలా ఉన్నప్పటికీ, సినిమా ప్రమోషన్స్‌లో కొత్తదనం సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. బుల్లితెర బ్యూటీ శ్రీముఖి, ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో, క్యూట్‌నెస్‌తో ఎట్రాక్ట్ చేసిన 'ఐస్‌క్రీమ్' బ్యూటీ తేజస్వి మాదివాడ, మరో అందాల భామ సుప్రియ ఈ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్స్. అలాగే 'చిన్నదాన నీకోసం' ఫేం మిస్తీ చక్రవర్తి కూడా ఈ సినిమాకి యాడెడ్ గ్లామర్. వీటన్నిటికీ మించి శ్రీనివాస్ అవసరాల పేరొక్కటి చాలు, ఆడియన్స్ థియేటర్లకు రావడానికి. పబ్లిసిటీ అదిరింది, స్టార్ కాస్టింగ్ కూడా బాగుంది. ఇంకేముంది, 'బాబు బాగా బిజీ' వసూళ్ళ లెక్కలతోనూ బిజీ అవుతాడేమో చూడాలిక.