పంచెకట్టులో నిండుగా సమంత దిగిన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో ఎంతో నిండుగా కనిపిస్తోంది సమంత. అయితే ఇది సినిమాలో ఫోటోనా? లేక రియల్‌గానా? అనేది తెలియ రావడం లేదు. చేనేతకి సమంత తెలంగాణాలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సమంత చేనేతో పంచె ట్టులో ఎందుకిలా దర్శనమిచ్చింది అంటూ ఆమె అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. మరో పక్క సమంత సుకుమార్ - చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కోసం ఈ గెటప్‌లో కనిపిస్తోందంటున్నారు. ఈ సినిమా పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం. ఈ ఫోటోలో సమంతతో పాటు రావు రమేష్ కూడా ఉన్నారు. పంచెకట్టులో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఇది. అందుకే చేనేత కోసం సమంత చేస్తోన్న పబ్లిసిటీనా? లేక సినిమాలో క్యారెక్టర్ కోసం సిట్యువేషనల్‌గా చేసిందా? అన్న దానికి క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఈ పంచె కట్టు ఫోటో చాలా బావుంది. మరో పక్క సమంత చరణ్‌తో చేస్తోన్న సినిమా కాక, నాగార్జునతో మరో సినిమాలోనూ నటిస్తోంది. అది నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'రాజుగారి గది 2' చిత్రం. ఈ చిత్రంలో సమంతది గెస్ట్ రోల్ అట. కానీ చాలా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ అట. ఈ సినిమాలో సమంత హీరోయిన్ కాదు కానీ, అంతకు మించి అంటున్నారు. ఈ సినిమాలో సీరత్ కపూర్ నాగ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.