'బాహుబలి ది కన్‌క్లూజన్', దంగల్' చిత్రాలు రెండూ నెంబర్ వన్ చిత్రాలుగా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచాయి. పోటా పోటీగా వసూళ్లు సాధిస్తూ, ఇండియన్ సినిమా చరిత్రని దేశ దేశాల చాటుతున్నాయి. 1000 కోట్లు మార్జిన్‌తో టోటల్ వసూళ్లలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది ఇప్పటికి 'దంగల్' చిత్రం. మొదట 'బాహుబలి ది కన్‌క్లూజన్' మొదట స్థానంలో ఉండగా, చైనాలో విడుదలయ్యాక 'దంగల్' ఆ ప్లేస్‌ని దక్కించుకుంది. అక్కడ 'దంగల్' 1000 కోట్లు సాధించింది ఇప్పటికి. అయితే ఇప్పుడు చైనాలో 'దంగల్' జోరు తగ్గింది. త్వరలోనే అక్కడ 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా విడుదల కానుంది. 'బాహుబలి' కున్న మేనియాతో ఈ సినిమా ఆక్కడ విడుదలయ్యిందంటే ఖచ్చితంగా 500 కోట్లు సాధించడం ఖాయం అని అంచనాలు వేస్తున్నారు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం 'బాహుబలి' వసూళ్లపై చైనాలో నమ్మకం వ్యక్తమవుతోంది. సో ఇదే కనుక జరిగితే 'దంగల్' ముచ్చట ఇంకెన్నాళ్లో కాదనిపిస్తోంది. ఈ రేంజ్‌లో అక్కడ 'బాహుబలి' విజయం సాధిస్తే, మళ్లీ టోటల్‌గా 'బాహబలి'దే మొదటి స్థానం కావచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలే పోటీ పడడం మన దేశం గర్వించదగ్గ విషయం. నిజంగానే దేశం మీసం తిప్పేలా చేశాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలు. మరే ఇతర సినిమా ఈ రెండు సినిమాలతోనూ పోటీ పడలేకపోతుండడం ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.