తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని, వరస హిట్లతో దూకుడు ప్రదర్శించిన కుర్ర హీరో రాజ్ తరుణ్. హ్యాట్రిక్ హీరోగా దూకుడు మీదున్న ఈ డైరెక్టర్ కమ్ హీరో తాజా చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. టైటిల్‌తోనే ఈ బుల్లోడు ఇప్పటికే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక స్టోరీ పరంగా కుక్కల్ని కిడ్నాప్ చేసే కిట్టు పాత్రలో రాజ్‌తరుణ్ చెలరేగిపోయాడట. కుక్కల్ని కిడ్నాప్ చేయడమే కాకుండా ప్రేయసితో లవ్ ట్రాక్‌ని నడపడంలోనూ కిట్టుగాడి రూటే సెపరేటట. కుక్కల్ని కిడ్నాప్ చేసే కోణంలో రాజ్ తరుణ్ పండించిన కామెడీ అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందట. ఇంతే కాదు ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటున్నాడు. అదేంటో తెరపైనే చూడాలంటున్నాడు రాజ్‌తరుణ్. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. అదే ముద్దుగుమ్మ అనుఇమ్మాన్యుయేల్‌తో లిప్ లాక్ సీన్. ఆ లిప్ లాక్ సీన్ సంగతేంటనీ మనోడిని అడిగితే అది సీన్ డిమాండ్ చేసిందంటున్నాడు. ఏది ఏమైనా ఈ లిప్ లాక్ సీన్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయ్యింది. ఆ సీన్‌లో ఈ ఇద్దరూ పండించిన కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉండబోతోందట. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. హంసానందిని ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి వెరీ వెరీ స్పెషల్ అట. ఇన్ని స్పెషాలలిటీస్ ఉన్న ఈ సినిమా అందర్నీ అలరించడానికి ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.