'బాహుబలి' సినిమా వచ్చినాకనే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. తెలుగు సినిమాని యావత్ ప్రపంచం గుర్తించేలా చేసిన ఘనత ది గ్రేట్ రాజమౌళికే దక్కింది. అందుకే 'బాహుబలి' ఓ తెలుగు సినిమానో, ఇండియన్ సినిమానో కాదు. అంతకుమించి అనేంతలానే. విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా అంటే కొన్ని కొలతలు, కొలమానాలు ఉంటాయి. ఖచ్చితంగా సినిమాకి ఇవి ఉండాలి. అవి ఉండాలి అనే లెక్కలుంటాయి. కానీ అవేమీ లేకుండా ఇంతమందిని మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ తెలుగు సినిమాకి వనరులు చాలా పరిమితం. ఇంత పరిమితమైన వనరులతో ఇంత క్వాలిటీ మూవీని తెరకెక్కించి, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం అనేది సాధ్యమైన విషయం కాదు. కానీ రాజమౌళి అది సాధ్యం చేసి చూపించాడు. ఈ సినిమాకి దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టారనీ ప్రచారం జరుగుతోంది. కానీ అది అంత సులువైన విషయం కాదు. కానీ ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టిన సంగతి వాస్తవమే. అయితే ఓ దర్శకున్ని నమ్మి అంత ఖర్చు పెట్టిన నిర్మాతలకు రాజమౌళి ఎంత నమ్మకం కల్గించి ఉండాలి. వారు డైరెక్టర్‌ని ఎంతగా నమ్మి ఉండాలి. ఈ సినిమాపై ఇంత హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగు ప్రజలు సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని రాజమౌళి వమ్ము చేయలేదు. నిజం చేసి చూపించాడు. ఇలాంటి డైరెక్టర్లు చాలా కొద్దిమందే ఉంటారు. అదే బాటలో ఆ కొద్ది మంది దర్శకులు నడవడానికి రాజమౌళి రాజమార్గం వేశాడనేది ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.