'బాహుబలి ది బిగినింగ్'లో అందాల అవంతికా రాజకుమారిగా ఒక పాటలో మెప్పించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ పాట తొలి పార్ట్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచింది. తమన్నా అందాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో పోటీ పడ్డాయి ఆ పాటలో. అయితే సినిమా మొత్తం తమన్నా ఆ గ్లామర్‌తో కనిపించలేదు. కానీ ఓ ఉద్యమ నాయకురాలిగా తన పాత్రకు న్యాయం చేసింది. కానీ ఎక్కడా ఫస్ట్ పార్ట్‌లో తమన్నా ఓ రాజకుమారి అని ప్రస్థావన ఎక్కడా కలగలేదు. సెకండ్ పార్ట్‌లో అయినా ఆమె రాజకుమారి అనే సంగతి తెలుస్తుందిలే అనుకున్నారంతా. అయితే సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి, తమన్నా క్లైమాక్స్ వరకూ ఎక్కడా కనిపించలేదు. సెకండ్ పార్ట్‌లో తన సీన్స్ ఎక్కువే ఉంటాయని చెప్పుకొచ్చింది తమన్నా. కానీ సినిమాలో మాత్రం తమన్నా పాత్ర నిడివి చాలా తక్కువే ఉంది. అయితే తమన్నాతో సెకండ్ పార్ట్‌లో సీన్స్ ఎక్కువే ఉన్నాయట. సినిమా లెంగ్త్ పెరిగిపోవడంతో ఆమె సీన్స్ కొన్ని పక్కన పెట్టేశారనీ టాక్ వినిపిస్తోంది. తర్వాత తర్వాత ఈ సీన్స్‌ని సినిమాలో యాడ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఏది ఏమైనా ఈ స్థాయి గొప్పతనం సంపాదించిన ఈ సినిమాలో ఒక్క సీన్‌లో నటించినా పూర్తి స్థాయి గొప్పతనం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ చిన్న ఆర్టిస్టుకీ కూడా ఆ క్రెడిట్ దక్కినట్లే కదా. అలాంటిది తమన్నా విషయంలో తక్కువెందకవుతుంది.