యంగ్ హీరోస్ అందరికీ ఇప్పుడు మంచి తరుణమే. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. నాని, శర్వానంద్, నిఖిల్ తదితర హీరోలకు ఈ ఏడాది బెస్ట్ హిట్స్ అందాయి. ఆ కోవలేనే ఉన్నాడు ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్. రామ్ గతేడాది 'నేను శైలజ..' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సక్సెస్‌ని 'హైపర్' సినిమాతో కొనసాగించలేకపోయినా, తాజా చిత్రం మళ్లీ తనకి బెస్ట్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతోనే చేస్తున్నాడు. ఈ సినిమాతో రామ్‌కి హిట్ పక్కా అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అలాంటిదట. రెగ్యులర్ స్టోరీతోనే 'నేను శైలజ..' సినిమాతో మంచి విజయం అందించాడు కిషోర్ తిరుమల. ఈ సారి డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ కంప్లీట్ మేకోవర్ అయ్యాడు కూడా. గెడ్డంతో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. ఇటీవలే 'కేశవ' సినిమాతో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ దారిలోనే రామ్ నడుస్తానంటున్నాడు. నిఖిల్ 'కేశవ'లో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు (గెడ్డంతో). ఆ లుక్ నిఖిల్‌కి హిట్ తెచ్చిపెట్టింది. అలాగే చాక్లెట్ బోయ్‌లా హ్యాండ్‌సమ్‌గా కనిపించే రామ్ కూడా గెడ్డంతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ లుక్‌ని ఫ్యాన్స్‌కి పరిచయం చేసేందుకు రామ్ డిఫరెంట్ సెల్ఫీలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. రామ్ డిఫరెంట్ లుక్ రామ్‌కి విజయం తెచ్చిపెడుతుందా? లేదా అని తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.