ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆయనకి అనవసరం. బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఆయన చెప్పినట్లుండడమే. ఆయనికి ఏమాత్రం జాలి, దయ ఉండవు మరి. చాలా కఠినాత్ముడు. ఇవన్నీ ఎవరి క్వాలిటీస్ అనుకుంటున్నారా? అదేనండీ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న 'గురు' సినిమాలో వెంకీ క్యారెక్టర్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ బాక్సింగ్ మాస్టర్ అన్నమాట. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'సాలా ఖదూస్' సినిమాకి రీమేకే ఈ సినిమా. ఒరిజినల్‌ని తెరకెక్కించిన సుధా కొంగర ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాతృకలో నటించిన రితికా సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా జాలిగా, దయగా కనిపించే పాత్రల్లోనే నటించిన వెంకీ ఈ సినిమాతో ఇంత వరకూ ఇలాంటి సీరియస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అంతేకాదండోయ్ మరో పక్క ఈ సినిమా కోసం వెంకీ ఓ పాటని కూడా హమ్ చేసేశారు. ఆ పాటని మాత్రం వెంకీ చాలా చాలా సరదాగా పాడేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు వెంకీ. పోజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఈ ట్రైలర్‌కి. అంతేకాదు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో వెంకీ. కండలు పెంచి, కొంచెం బొద్దుగా కనిపిస్తూనే ఫిట్‌గా కూడా ఉన్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.