అక్రమాయుధాల కేసులో అరెస్టయ్యి జైలు జీవితం అనుభవించాడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. జైలు జీవితం నుండి విముక్తి పొంది ఈ మధ్యనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. జైలు నుండి విడుదలయ్యాక హీరోగా ఆయన 'భూమి' అనే సినిమాలో నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌లో సంజయ్ దత్ గాయపడ్డాడు. గాయాన్ని లెక్క చేయకుండా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసి, యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కానీ ఒకానొక టైంలో నొప్పి తీవ్రత ఎక్కువైన కారణంగా వైద్యుల సలహా తీసుకోగా, ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. షూటింగ్‌లో ఆయనకి తగిలిన గాయం చిన్నది కాదంట. ఆ స్పాట్‌లో ఆయన పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందనీ ఆశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదమనీ తెలిపారు. అంతేకాదు కొన్ని రోజులు బెడ్ రెస్ట్‌లో ఉండాలని చెప్పారట. దాంతో చిత్ర యూనిట్ ఆందోళనలో మునిగిపోయింది. మరో పక్క సంజయ్‌దత్‌కి ఇలా అయినందుకు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సంజూ భాయ్ జీవితం అంతా కష్టాల కడలిలోనే మగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త రిలీఫ్ అయ్యారనుకుంటే ఇంతలోనే ఇలా జరిగింది. ఆయన తొందరగా కోలుకొని మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం!