వెండితెర, బుల్లితెర - ఇంకో కొత్త తెర

మరిన్ని వార్తలు

వెండితెర గురించి విన్నాం, బుల్లితెర గురించి తెలుసు. కానీ కొత్తగా ఇంకో తెర పుట్టుకొచ్చింది. అదే 'వెబ్‌ సిరీస్‌'. షార్ట్‌ ఫిలింస్‌కి ఇంటర్‌నెట్‌ ఎలా వేదికయ్యిందో అందరికీ పరిచయమే. ఆ ఇంటర్‌నెట్‌ని బేస్‌ చేసుకుని వెబ్‌సిరీస్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు కొందరు. ఇప్పటికే పలు వెబ్‌ సిరీస్‌లు నెటిజన్లను బాగా ఎట్రాక్ట్‌ చేసేశాయి. సినిమాల్ని ఆన్‌లైన్‌లో చూడటం, టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్స్‌ని ఇంటర్‌నెట్‌లో మళ్ళీ తిలకించడం వంటివాటికి భిన్నంగా పూర్తిగా ఇంటర్‌నెట్‌కే పరిమితమయ్యేలా ఈ వెబ్‌సిరీస్‌ ఉంటున్నాయి. తాజాగా యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ వెబ్‌ సిరీస్‌పై దృష్టిపెట్టాడు. 'ఎందుకిలా' పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందుతుండగా, అందులో నటిస్తున్నాడీ యంగ్‌ హీరో. రానున్న రోజుల్లో వెబ్‌సిరీస్‌ పట్ల ఆకర్షితులయ్యేవారి సంఖ్య చాలా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హాలీవుడ్‌లో ఈ వెబ్‌సిరీస్‌లకు చాలా క్రేజ్‌ ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో తక్కువే. అయినప్పటికీ ఇప్పుడిప్పుడే ఈ వెబ్‌సిరీస్‌ చాలామందికి ఉపాధి కల్గించడం ప్రారంభించింది. ఇందులో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు. ఉపాధి అవకాశాలనిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతున్న వెబ్‌సిరీస్‌ భవిష్యత్తులో బుల్లితెర - వెండితెరకు ధీటుగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదేమో చూడాలిక. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS