ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’.. అంటూ పవన్ కల్యాణ్ కాటమరాయుడి వేషంలో చలరేగిపోయాడు. పంచె కట్టుతో అదరగొట్టాడు. ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. వాయిదాలు పడుతూ వస్తున్న టీజర్.. ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేశారు. పవన్ మూమెంట్స్, చెప్పిన డైలాగులు, అనూప్ ఇచ్చిన ఆర్.ఆర్.. ఇవన్నీ ఫ్యాన్స్ ఈల వేసి గోల చేసేలా ఉన్నాయి. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. మార్చి చివరి వారంలో కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అంటే.. సమ్మర్ కి బోణీ కొట్టేది కాటమరాయుడే అన్నమాట. ఈ వేసవి బరిలో చాలా సినిమాలున్నాయి. దానికి పవన్ కాటమరాయుడు కూడా తోడైంది. సో.. ఈసమ్మర్ హీట్ కాటమరాయుడు టీజర్‌తో మొదలైందన్నమాట. శ్రుతి గ్లామర్ ఈ చిత్రానికి ఓ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. గబ్బర్ సింగ్ తరవాత పవన్ - శ్రుతి కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఆ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ఇక్కడా రిపీట్ కావాలని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.