కన్నడ బ్యూటీ రష్మిక మామూలుది కాదండోయ్. ఏకంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజునే లాక్ చేసి పడేసింది తన ముద్దు ముద్దు మాటలతో. రీసెంట్గా జరిగిన ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా విచ్చేసిన దిల్రాజును మీ సినిమాలో నాకూ ఓ ఛాన్స్ ఇప్పించండి.. అంటూ స్టేజ్ పైనుండి ఆడియన్స్ సమక్షంలోనే అడిగేసింది. స్టన్ అయిన దిల్‌రాజుకు మాటివ్వక తప్పలేదు. తన తదుపరి సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెప్పాల్సి వచ్చింది. ఇంకేముంది, అలా అప్పుడే మరో క్రేజీ ప్రాజెక్ట్ రష్మిక ఖాతాలో పడిపోయిందంతే.
అంతేకాదు, రష్మికకు మైక్ ఇస్తే, ఇంకెవ్వరికీ మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. అని తేలిపోయింది. అసలే బోలెడంత క్రేజ్.. ఇక స్టేజ్‌పై ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తే ఇక ఫ్యాన్స్ ఆగుతారా.? పూనకమొచ్చినట్లు ఊగిపోతారు.. నన్ను కొంచెం మాట్లాడనివ్వండిరా.. అంటూ మధ్య మధ్యలో ఫ్యాన్స్‌నీ ముద్దు ముద్దుగా వారించేసింది కూడా. ఈ రేంజ్లో రష్మిక పర్ఫామెన్స్ చూసి, ఈ వేడుకకు విచ్చేసిన అతిధులే ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ‘భీష్మ’ సినిమాకి రష్మిక మెయిన్ అస్సెట్ కానుందనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇకపోతే, ట్రైలర్లోనూ రష్మిక డామినేషన్ బాగా కనిపిస్తోంది. నితిన్‌ని బాగా ఆడేసుకున్నట్లే అనిపిస్తోంది. అంతా బాగానే వుంది. కానీ, చూడాలి మరి.. రష్మిక డామినేషన్, బాక్సాఫీస్కీ కాసుల కిక్కిస్తుందో లేదో.