బికినీ ప్రచారంలో మునిగి తేలుతున్న బ్యూటీ!

మరిన్ని వార్తలు

దిశా పటానీ అంటే బికినీ.. బికినీ అంటే దిశా పటానీ అనే స్థాయిలో ఆమె బికినీ షో సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోంది గత కొంతకాలంగా. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్‌' సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. ఆ సినిమా తర్వాత మళ్ళీ దిశా పటానీ టాలీవుడ్‌ వైపు చూడలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్న ఈ బ్యూటీ, ఈ మధ్య తన తాజా బాలీవుడ్‌ సినిమా 'మలంగ్‌' ప్రచారంలో బిజీ అయిపోయింది. ఆ సినిమాకి సంబంధించి దిశా పటానీ ప్రమోషన్స్‌ అన్నీ బికినీ చుట్టూనే జరుగుతున్నాయి. సినిమాలో ఈ బ్యూటీ బికినీ గ్లామర్‌ని ఓ రేంజ్‌లో ఒలకబోసేసింది. నిజానికి దిశా పటానీ బికీనీ సొగసుల్ని ప్రదర్శించడం ఇదే కొత్త కాదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Some more #malang❤️🧜🏻‍♀️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

అయితే, ఓ సినిమా కోసం మరీ ఈ స్థాయిలో బికినీ షో చేయడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఆన్‌ లొకేషన్‌.. అంటూ బికినీ స్టిల్స్‌నీ, వీడియోస్‌నీ సోషల్‌ మీడియా వేదికగా వదులుతోంది. చక్కనమ్మ చూపిస్తానంటే, చూసేందుకు కుర్రకారు ఎగబడటం సహజమే కదా. అలా సోషల్‌ మీడియాలో దిశా పటానీ బికినీ గ్లామర్‌కి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వస్తోంది. ఇదే 'మలంగ్‌' సినిమాకి ఫ్రీ పబ్లిసిటీగా మారుతోంది. 'మలంగ్‌' సినిమాలో సీనియర్‌ నటుడు అనీల్‌ కపూర్‌, యంగ్‌ హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో కన్పించబోతున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS