సిగ్గుపడితే కుదరదంటోన్న హాట్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

దిశా పటానీ సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోవడమే కాదు, అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ స్టేట్‌మెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా దిశాపటానీ దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది అదేంటో తెలుసా.? ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు సిగ్గపడకూడదంటోంది. అదేనండీ సిగ్గు పడితే గ్లామర్‌ ప్రపంచంలోకి రానే కూడదనీ ఈ హాట్‌ బ్యూటీ అభిప్రాయం కాబోలు. అయితే ఎక్స్‌పోజింగ్‌ అనేది కేవలం హీరోయిన్స్‌కీ, మోడల్స్‌కీ మాత్రమే సంబంధించిన విషయం కాదు.

ట్రెండ్‌ మారింది. ఓ మోస్తరు టౌన్స్‌లోని అమ్మాయిలు కూడా ఇప్పుడు ఫ్యాషన్‌ పేరుతో, ట్రెండ్స్‌ పేరుతో ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నారు. ఇక హైద్రాబాద్‌ తదితర సిటీల్లోని మాల్స్‌లో గ్లామర్‌ ఎప్పుడో నెక్స్ట్‌ లెవల్‌కి చేరిపోయింది. సెలబ్రిటీస్‌ని మించిన గ్లామర్‌ షోని ఆయా మాల్స్‌లో విరివిగా చూస్తున్నాం.. అంటోంది దిశాపటానీ. నిజమే ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. ట్రెండ్స్‌కీ, స్టైల్స్‌కీ ఇప్పుడు అమ్మాయిలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అస్సలేమాత్రం సిగ్గుపడట్లేదు.

బాహ్య ప్రపంచంలోనే కలరింగ్‌ ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీస్‌గా మేం ఎక్స్‌పోజింగ్‌ చేస్తే తప్పేముందంటోంది. అదీ నిజమే. కానీ ఇప్పుడెందుకు దిశాపటానీకి ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఇంత బోల్డ్‌గా స్పందించాల్సి వచ్చిందో కదా. 'లోఫర్‌' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన దిశా పటానీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో నెటిజన్స్‌కి ఎక్కువ క్లోజ్‌గా మూవ్‌ అవుతూ ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS