ఎక్కడెక్కడ దాచావమ్మా ఇన్ని అందాల్ని అంటూ పాడుకోవాల్సి వస్తోంది దిశా పటానీని చూస్తుంటే. అవును మరి మరోసారి ఈ అమ్మడు కమ్మగా అందాల విందుకు తెర లేపింది. ఎప్పుడయితే కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్కి బ్రాండ్ అంబాసిడర్‌గా దిశాపటానీని ఎంచుకున్నారో, ఎన్ని రకాలుగా ఆ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయాలో అన్ని రకాలుగానూ ప్రమోట్ చేసేస్తోందీ ముద్దుగుమ్మ.
వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్ టూ పీస్ బికినీలతో కేక పుట్టించిన దిశాపటానీ తాజాగా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ సేమ్ బ్రాండ్ కాస్ట్యూమ్స్‌లో మరోసారి దుమ్ము దులిపేసింది. వైల్డ్ యాంగిల్ గ్లామర్‌తో చితక్కొట్టేసింది. బ్రాండ్ ప్రమోషన్ సంగతేమో కానీ, దిశాపటానీ ఇక ఇదే పనిగా పెట్టుకుంది కాబోలు. గ్లామర్‌లో ఎన్ని ఎత్తులెక్కాలో, ఎన్ని లోతులు దించాలో ఈమెకి తెలిసినట్లుగా మరొకరికి తెలీదనడం అతిశయోక్తి కాదేమో.