స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 'నా పేరు సూర్య' నిరాశపరచడంతో బాగా డీలా పడిపోయిన బన్నీ ఫ్యాన్స్, తమ అభిమాన హీరో తదుపరి చిత్రం ఎలా ఉండబోతోందా.? అనే ఉత్కంఠతో ఉన్నారు. అయితే త్రివిక్రమ్‌తో బన్నీ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ సరసన చిందేయనున్న ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు చర్చల్లో నిలిచింది.
'భరత్' బ్యూటీ కైరా అద్వానీ దాదాపు ఖరారైందని సమాచారమ్. కానీ ఈ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అందుకే చిత్రయూనిట్ అఫీషియల్‌గా డిక్లర్ చేయలేదట. కైరా అద్వానీ ప్రస్తుతం 'వివిఆర్' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్‌లో పాల్గొని తిరిగి బాలీవుడ్‌కి చెక్కేయనుందట కైరా.
అక్కడ ఆల్రెడీ రెండు సినిమాలకు కమిట్ అయ్యింది కైరా అద్వానీ. 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ ఖాన్'లో కైరా అద్వానీ హీరోయిన్. అలాగే తాజాగా ఇంకో మూవీకి కూడా సైన్ చేసింది. బాలీవుడ్‌లో ఒక్క సినిమా అంటేనే కష్టం. ఇక రెండు సినిమాలతో బిజీగా ఉన్న కైరా తెలుగు సినిమాలపై ఎంతవరకూ దృష్టి పెట్టగలదు.? ఇదిలా ఉంటే, సరిగ్గా ఇదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ పేరును బన్నీ సూచిస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రకుల్ - బన్నీ కాంబోలో 'సరైనోడు' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సో ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, ఒకవేళ కైరా నో అంటే, ఆ ప్లేస్‌లో రకుల్ ఫిక్సైనా కావచ్చు. అప్పుడు రకుల్ మళ్లీ తెలుగులో సత్తా చాటే అవకాశాలు లేకపోలేదు. సంక్రాంతికి విడుదల కానున్న 'ఎన్టీఆర్' బయోపిక్‌లో రకుల్ శ్రీదేవి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.