ఈ బ్రాండ్, ఆ బ్రాండ్ అనే తేడా లేకుండా బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడంలో మొట్ట మొదటిగా గుర్తొచ్చే ముద్దుగుమ్మ దిశా పటానీ. ముఖ్యంగా కాల్విన్ క్లెయన్ ఇన్నర్ వేర్ బ్రాండ్‌ని దిశా పటానీ ప్రమోట్ చేసినంతగా మరెవ్వరూ ప్రమోట్ చేసి ఉండరు. దిశా పటానీ దెబ్బకి ఆ బ్రాండ్ చచ్చినట్లు యూజ్ చేసేవారు చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఈ బ్యూటీ తాజాగా దీపావళి స్పెషల్ అంటూ, ఎప్పుడూ కనిపించే అరకొర దుస్తుల్ని కాసేపు పక్కన పెట్టి, ఒంటి నిండా దుస్తులేసుకుని, అందంగా, ఆహ్లాదంగా, ఆకర్షణగా కెమెరాకి పోజిచ్చింది.
ఎప్పుడూ ఇన్నర్ వేర్‌లోనే చూసి చూసి బోర్ కొట్టిందనుకున్న దిశా పటానీ అందాల కళా పోషకులకు ఈ పోజులు కొత్తగా సరికొత్తగా అలరిస్తున్నాయి. స్కై బ్లూ కలర్ గాగ్రా చోళీ ధరించి చాలా అందంగా కనిపిస్తోంది. ఓ చేతికి వాచీ, ఇంకో చేతికి ముత్యాలు పొదిగిన సింగిల్ బ్యాంగిల్ ధరించి, గెడ్డం కింద చేయి పెట్టుకుని స్టైల్‌గా నిలబడింది. డార్క్‌లో ఎగురుతున్న లైటింగ్ బెలూన్స్ బ్యాక్ గ్రౌండ్ దిశా పటానీ అందాన్ని మరింత కాంతివంతంగా మార్చేసింది.