అందాల భామలు ఫిట్‌నెస్ మంత్ర పఠించడం అనేది సర్వ సాధారణమైన విషయమే. అయితే, కొంతమంది అందాల భామలు మాత్రం తమలోని క్యూట్ అప్పీల్ చెడిపోకుండా వుండేందుకు పరిమితమైన స్థాయిలోనే వర్కవుట్స్ చేస్తుంటారు. కొందరు మాత్రం, చాలా కష్టమైన కసరత్తులు చేసేస్తుంటారు. అలా కష్టపడే లిస్ట్‌లో దిశా పటానీ పేరు అందరికన్నా ముందుంటుంది. 'ఏం చేసినా, అది ఆరోగ్యం కోసమే.
ఆరోగ్యమే అందం..' అని చెబుతుంటుంది దిశా పటానీ. 'మరీ ఇంతలా కష్టపడాలా.? ఎక్కువ వర్కవుట్స్ చేసేస్తే, గ్లామర్ దెబ్బ తింటుంది కదా.?' అని ప్రశ్నిస్తే, 'రిస్క్ లేకపోతే లైఫ్‌లో రస్క్ కూడా దొరకదు' అన్నట్టుగా సమాధానమిచ్చింది. అదీ నిజమేననుకోండి.. అది వేరే సంగతి. లవర్ టైగర్ ష్రాఫ్‌తో పోటీ పడుతుంటుంది ఫిట్‌నెస్ విషయంలో దిశా పటానీ.
ఎవరూ ఊహించని విధంగా బరువులు ఎత్తేస్తుంటుంది.. పురుష పుంగవులు సిక్స్ ప్యాక్ ఫిజిక్ సాధించడం కోసం ఎలా కష్టపడతారో, దిశా పటానీ కూడా అలాగే యాబ్స్ చూపించేందుకోసం తెగ కష్టపడిపోతుంటుంది. ఏం చేసినా దిశా పటానీలోని క్యూట్ అండ్ హాట్ అప్పీల్ మాత్రం చెరిగిపోదు. ఈ సీక్రెట్ ఏంటి.? అనడిగితే, 'బహుశా నా శరీరం తీరే అందుకు కారణమేమో.. అన్నిటికీ మించి, నేనెప్పుడూ హ్యాపీగా వుంటాను.. ఎలాంటి భయాల్నీ దగ్గరకు రానివ్వను.. చెడు ఆలోచనలతో అసలే వుండను.. అదే నా సక్సెస్ సీక్రెట్' అని చెప్పింది ఈ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా 'లోఫర్'.