మెగా రాకుమారుడు వరుణ్‌తేజ్‌తో తొలి సారిగా నటించింది ముద్దుగుమ్మ దిశా పటానీ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ప్రపంచం మెచ్చే హీరో జాకీ చాన్ సినిమాలో ఛాన్స్ దక్కించేసుకుంది. ఈ సినిమాలో జాకీ చాన్‌తో రొమాన్స్ చేయడమే కాకుండా యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. తొలి సారిగా ఇండో - చైనా మూవీలో నటించడం తనకెంతో గర్వంగా ఉందని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అయితే తెలుగు సినిమాల్లో నటిస్తే బోలెడంత అభిమానం వస్తుంది. కానీ బాలీవుడ్ మూవీల్లో నటిస్తే మనలోని టాలెంట్ బయటికి వస్తుందని అభిప్రాయపడింది. వావ్! తెలుగు, హిందీ సినిమాల డిఫరెన్స్‌ని ఒక్క మాటలో చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. గ్లామరస్ పాత్రలకి తనకేం మొహమాటం లేదంటోంది. కానీ ఎప్పుడూ గ్లామరస్ పాత్రలే చేస్తే కిక్కేముంటుంది. అందుకే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తేనే అసలు కిక్కు అంటోంది. మామూలుగా హీరోయిన్‌గా ఓ రేంజ్‌కి వచ్చాక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ గురించి ఆలోచిస్తారు. అలాంటిది ఈ ముద్దుగుమ్మ అప్పుడే ఈ తరహా పాత్రల్లో నటించేయాలంటోంది. మరి ఈమె కోరిక తీరేదేనా? అదీ కాక మాంచి యాక్షన్ సినిమాల్లో నటించాలనుందంటోంది. అమ్మడు డాన్సుల్లో టాపర్. యాక్టింగ్ కూడా టాలెంట్ ఉన్నదే. అందుకే జాకీ చాన్ మెప్పు పొందింది. సో ప్రయత్నిస్తే లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చాటే కళ లేకపోలేదు. చూద్దాం ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్‌ని ఎక్కడ ఎలా ఉపయోగిస్తుందో!