సినిమా అంటేనే గ్లామర్ షో. గ్లామర్ లేకుండా కమర్షియల్ సినిమాలు గట్టెక్కడం చాలా కష్టం. అలాంటిది హీరోయిన్స్ గ్లామర్ షో చేయనంటే ఎలా కుదురుతుంది. ఈ విషయం తెలిసే సినీ రంగంలోకి అడుగుపెడతారు ముద్దుగుమ్మలు. అయితే నిత్యామీనన్ తదితర హీరోయిన్లు లక్కీగా అందుకు మినహాయింపుగానే మంచి యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఆ కోవలో చేరిందే ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ ముద్దుగుమ్మ నిన్న కాక మొన్నే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. వస్తూ వస్తూనే ఆంక్షలు పెట్టుకుంది. నేను ఎక్స్‌పోజింగ్ చెయ్యను అని. అలాగే ఇంతవరకూ నెట్టుకొచ్చింది. చేసింది చాలా తక్కువ చిత్రాలే అయినా కానీ మంచి నటి కీర్తి సురేష్ అని పేరు తెచ్చేసుకుంది. అయితే తాజాగా అమ్మడు మాటల్లో చాలా మార్పులొచ్చాయి. సినిమా రంగంలో గ్లామర్ షో కంపల్సరీ అని ఆమె నోటితో ఆమె ఒప్పేసుకుంది. అందుకు తానేం మినహాయింపు కాదని కూడా చెబుతోంది. మొదట్లో స్కిన్ షోకి తాను దూరం అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా మారిపోవడంతో ఇండస్ట్రీలో అంతా షాక్ తింటున్నారు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని చాలా తొందరగానే తెలుసుకుందంటూ ఒకింత ఆనందపడుతున్నారు కూడా. త్వరలోనే ఈ భామ నాని సినిమా 'నేను లోకల్'తో సందడి చేయనుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే బంపర్ ఆఫర్స్ కూడా సొంతం చేసుకుంది. కీప్ ఇట్ అప్ కీర్తి.