యాక్షన్‌ మోడ్‌లో హాట్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'లోఫర్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశా పటానీ. తొలి సినిమాకే మెగా కాంపౌండ్‌ హీరోతో, స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకున్నా, ఆ సినిమా రిజల్ట్‌ బెడిసికొట్టేసరికి అమ్మడిని ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో దిశాపటానీకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. 

హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఎప్పటికప్పుడే అప్‌డేట్‌గా ఉంటుంది. అభిమానుల్ని గిలిగింతలు పెట్టిస్తుంటుంది. ఫిట్‌నెస్‌ కోసం ఎప్పుడూ ఏదో ఒక కసరత్తులు చేస్తూ కనిపించే దిశాపటానీకి బాలీవుడ్‌లో బంపర్‌ ఛాన్స్‌ దక్కించుకుంది. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'భారత్‌' సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 

యాక్షన్‌ ఫ్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం దిశా పటానీ యాక్షన్‌ దుమ్ము దులిపేయనుందట. అందుకోసం బీభత్సంగా కసరత్తులు చేసేస్తోంది. అలా కసరత్తులు చేస్తూ తీసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోకి బెస్ట్‌ రెస్పాన్స్‌ వచ్చేస్తోంది. 

ఇదంతా చూస్తుంటే, సల్మాన్‌ ఖాన్‌తో పాటు ఈ హాట్‌ బ్యూటీ కూడా యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేయనుందనిపిస్తోంది. ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మకు గతంలో యాక్షన్‌ సినిమాలో నటించిన అనుభవం ఉంది. నేషనల్‌ యాక్షన్‌ కింగ్‌ జాకీచాన్‌తో 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో దిశా పటానీ నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS