సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బ్యూటీ దిశా పటానీ. ప్రస్తుతం 'సంఘమిత్ర' సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతోంది. 'లోఫర్' సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో జత కట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ని అందివ్వకపోగా, అమ్మడు సోషల్ మీడియాలో అందాలారబోతకే పరిమితమైపోయింది. అయితే ఈ మధ్య 'సంఘమిత్ర' సినిమాతో మళ్లీ జాక్ పాట్ కొట్టింది ఈ హాట్ బ్యూటీ. ఇదో హిస్టారికల్ మూవీ. ఈ సినిమాలో ఈ బ్యూటీ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేయాల్సి వస్తుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ శృతిహాసన్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ గోల్డెన్ ఛాన్స్ వచ్చి దిశా పటానీని పలకరించింది. చూడాలి మరి ఈ బ్యూటీ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంత పాపులర్ అవుతుందో! సినిమాతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాని మాత్రం అస్సలు మర్చిపోదు ఈ బ్యూటీ. తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడూ ఇలా హాట్ హాట్ పిక్స్‌తో దర్శనమిస్తూనే ఉంటుంది. ఈ ఫోటోలో దిశా పటానీ అందం కేక పుట్టిస్తోంది కదా. అలాగే సో క్యూట్ కూడా!