టాలీవుడ్ లోనే కాదు, దేశం మొత్తమ్మీద అద్భుతమైన డాన్సర్ అనిపించుకున్నాడు అల్లు అర్జున్. తన స్టెప్పులంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా హీరోయిన్లలో బన్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో దిశాపటానీని కూడా చేర్చేయొచ్చు. తన దృష్టిలో ఇద్దరే ఇద్దరు బెస్ట్ డాన్సర్లని ఒకరు.. హృతిక్ రోషన్ అయితే, మరొకరు అల్లు అర్జున్ అని కితాబు ఇచ్చేసింది.
`సిటీమార్`, `బుట్టబొమ్మ` పాటల్లో బన్నీ వేసిన స్టెప్పులకు ఎప్పుడో ఫ్లాట్ అయిపోయానని, తనతో కలసి డాన్స్ చేసే అవకాశం రావడం ఓ వరమని అంటోంది. `పుష్ఫ`లో దిశాపటానీ ఓ ప్రత్యేక గీతంలో అలరించబోతోంది. బన్నీతో కలిసి తొలిసారి స్టెప్పులు వేయబోతోంది. `ఆ క్షణాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా. నా సినీ జీవితంలో కచ్చితంగా మర్చిపోలేని సందర్భం` అని ఉద్వేగంగా చెబుతోంది దిశాపటానీ.