ఫ్యాషన్‌ని ఫాలో అవ్వడమే కాదు, ఫ్యాషన్‌లో న్యూ ట్రెండ్స్‌ని క్రియేట్ చేయడంలో ముద్దుగుమ్మ దిశా పటానీది అందె వేసిన చెయ్యి. ఇదిగో ఈ ఫోటోలో ఆమె కాస్ట్యూమ్, స్టైల్ చూస్తే ఆ మాట మీరే ఒప్పుకొని తీరాల్సిందే. అమ్మడు తాజాగా 'సంఘమిత్ర' సినిమా కోసం ప్రిపరేషన్స్‌లో ఉంది. శృతిహాసన్ నుండి తప్పుకుని ఈ బంపర్ ఛాన్స్ దిశాపటానీని వరించింది. నటనా ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు వంటి వాటిలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతోంది ఈ సినిమా కోసం బ్యూటీ దిశా పటానీ. అయినా కానీ గ్లామర్‌ని మాత్రం మిస్ చేయకుండా సోషల్ మీడియాలో కొత్త కొత్త ట్రెండ్స్‌ని ఫాలో చేస్తూ ఆల్వేస్ ట్రెండింగ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. తొలి సినిమాకే మెగా కాంపౌండ్ హీరోతో జత కట్టింది. 'లోఫర్'లో వరుణ్‌తేజ్‌తో నటించింది. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఏమాట కామాటే చెప్పాలి ఈ న్యూ కాస్ట్మూమ్లో దిశా పటానీ భలే ఎట్రాక్ట్ చేస్తోందిలే.