రకరకాల బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడంలో అందాల భామలు తమదైన శైలిలో సత్తా చాటుతూ ఉంటారు. బ్రాండ్ వేల్యూని బట్టి అధిక మొత్తాల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటూ ఉంటారు ఈ ప్రమోషన్స్‌కి. అలా తాజాగా 'ప్యూమా' అనే బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ తరహా పలు బ్రాండ్స్‌కి ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాలను విందుగా ఎర వేసి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసిన పలు సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఆ రకంగా ఓ పక్క బ్రాండ్‌కీ వేల్యూ పెంచింది. మరో పక్క తన అందాలకూ వేల్యూ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఏ బ్రాండ్‌కి ఎలా ప్రమోషన్ ఇవ్వాలో దిశా పటానీకి తెలిసినంతగా మరొకరికి తెలీదనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. ఎలాంటి కాస్ట్యూమ్ అయినా కరెక్ట్‌గా సెట్ అయ్యే ఫిజిక్ ఈ ముద్దుగుమ్మ సొంతం. అందుకే ఈ తరహా బ్రాండ్స్ ప్రమోషన్స్‌లో ఈ ముద్దుగుమ్మనే ఎక్కువగా దించుతుంటారు. తాజాగా 'ప్యూమా' బ్రాండ్ కోసం అందాల దిశా పెట్టిన ఈ పోజు చూశారుగా. బ్రాండ్ సంగతి పక్కన పెడితే, అమ్మడు తన హాట్ అందాల విందుతో కుర్రకారు గుండెల్లో ప్రణయ రాగాలు పుట్టించేస్తోందంతే!