చాలా మంది సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో డేటింగ్స్ చేస్తుంటారు. సినీ రంగంలో ముఖ్యంగా బాలీవుడ్‌లో చాలా కామన్ ఇష్యూ ఇది. అయితే కొన్నాళ్లు డేటింగ్ చేశాక, విడిపోయి, ఎవరి దారి వారు చూసుకోవచ్చు. లేదా డేటింగ్‌లో ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకుని లైఫ్ లాంగ్ లవ్‌ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. లవ్ సెట్ కాకుంటే, సామరస్యంగా విడిపోనూ వచ్చు. ఇవన్నీ ఈ డేటింగ్స్‌లో 'షరతులు వర్తిస్తాయి' అనే టైపు రూల్స్ అన్న మాట.
ఇలా ఈ మధ్య డేటింగ్, లవ్ అంటూ వార్తల్లో హాట్ హాట్‌గా నిలిచి, సింపుల్‌గా బ్రేకప్ చెప్పేసుకున్న జంటలు చాలానే చూశాం. తాజాగా ఈ బ్రేకప్ లిస్టులోకి మరో యువజంట చేరిపోయిందా.? అంటే అవునేమో అని విశ్వసనీయ బాలీవుడ్ వర్గాల సమాచారమ్. ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరు.? ఇంకెవరు.. ఇన్నర్ వేర్ బ్రాండ్ అంబాసిడర్ దిశా పటానీ, యంగ్ అండ్ రొమాంటిక్ కండలవీరుడు టైగర్ ష్రాఫ్. వీరి మధ్య ఏదో ఉందని, ఏదో ఏంటీ..? పీకల్లోతు లవ్‌లాంటిదే ఉందని చాలా సందర్భాల్లో వీరి ద్వారానే ప్రూవ్ అయ్యింది. కానీ అఫీషియల్‌గా వీరెప్పుడూ, ఎక్కడా కన్‌ఫామ్ చేయలేదనుకోండి.
బీచ్‌లు, రెస్టారెంట్లు, ఐలాండ్‌లూ.. ఇలా ఒక్కటేమిటి, చాలానే రొమాంటిక్ వెకేషన్స్ ఎంజాయ్ చేసేసింది ఈ రొమాంటిక్ జంట. అయితే, ఇప్పుడు వీరి మధ్య తలెత్తిన ఏవో చిన్నపాటి మనస్పర్ధల కారణంగా లవ్‌కి బ్రేకప్ చెప్పేసి, ఫ్రెండ్స్‌లా ఉండాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. అయితే ఈ విషయమై కూడా పక్కా క్లారిటీ ఏమీ లేదు కానీ, ఏమో చెప్పేసుకున్నా చెప్పేసుకుంటారు. అయినా, కందకు లేని దురద కత్తిపీటకెందుకు.? అంటారు కదా. అలాగే వారికి లేని బెడద మనకెందుకు చెప్పండి. అంతేగా.. అంతేగా..!