దిశా పటానీ.. పెళ్ళి పీటలెక్కబోతోందా.?

మరిన్ని వార్తలు

దిశా పటానీ


బాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సీజన్‌ నడుస్తోంది. మొన్న సోనమ్‌ కపూర్‌, నిన్న దీపికా పడుకొనే - రణ్‌వీర్‌ సింగ్‌, ఆ తర్వాత లైన్‌లో ప్రియాంకా చోప్రా - నిక్‌ వివాహం.. నెక్స్‌ట్‌ ఏంటీ.! ఇంకెవరు, దిశా పటానీ - టైగర్‌ ష్రాఫ్‌ల పెళ్ళేనంటూ బాలీవుడ్‌ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. దిశా పటానీ - టైగర్‌ ష్రాఫ్‌ మధ్య ఎఫైర్‌ చాలాకాలంగా నడుస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారన్న ప్రచారమూ జరిగింది. అయితే, అదంతా ఉత్తదేనని తేలిపోయింది.

 

'బాఘి-2' సినిమా టైమ్‌లో ఇద్దరి మధ్యా ఎఫైర్‌ పీక్స్‌కి వెళ్ళిపోయింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారన్న గుసగుసలు కూడా విన్పించాయి. తాజాగా ఈ ఇద్దరూ దీపికా పడుకొనే - రణ్‌వీర్‌ సింగ్‌ల వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. మొత్తంగా ఈ వేడుకలో హాటెస్ట్‌ అవతార్‌ ఎవరిదైనా వుందంటే, అది దిశా పటానీది మాత్రమే. సోషల్‌ మీడియాని 'ఇన్నర్‌ వేర్‌ హాట్‌నెస్‌తో' హీటెక్కించేస్తోన్న దిశా పటానీ, దీప్‌-వీర్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో హెవీ డోస్‌ క్లీవేజ్‌తో కిర్రాకు పుట్టించింది.

 

క్లీవేజ్‌ సొగసుల వ్యవహారం పక్కన పెడితే, దిశా పటానీ - టైగర్‌ ష్రాఫ్‌ జంటగా కన్పించడం, ఇద్దరూ చాలాసేపు కలిసి తిరగడం, అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతో, బాలీవుడ్‌ సినీ జనం త్వరలోనే ఈ జంట ఓ తీపి కబురు చెప్పబోతోందని ఫిక్సయిపోయారు. దిశా - టైగర్‌ ఈ ప్రచారంపై పెదవి విప్పుతారా.? తమ మధ్య రిలేషన్‌ని కన్‌ఫామ్‌ చేస్తారా.? అంతా ఉత్తదేనని లైట్‌ తీసుకోమంటారా? ఏం జరుగుతుందో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS