నాగచైతన్య - సమంత విడిపోయి చాలా కాలమైనా, వాళ్ల ఎడబాటు ఇప్పటికీ మీడియాలో హాట్ టాపిక్కే. సమంత, చైతూ మీడియాకు ఎప్పుడు ఎదురైనా, ఈ ప్రశ్న తప్పడం లేదు. నిన్నా మొన్నటి వరకూ ఈ ప్రశ్నని నాగచైతన్య చాలా తెలివిగా తప్పించుకొన్నాడు. ప్రింట్ మీడియాతోగానీ, ఎలక్ట్రానిక్ మీడియాతో గానీ ములాఖాత్ అయినప్పుడు విడాకుల ప్రస్తావన రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకొన్నాడు. అది బాగానే వర్కవుట్ అయ్యింది కూడా. అయితే ఈమధ్య సమంత విడాకుల విషయంలో బాగా ఓపెన్ అయిపోయింది. చైతూతో తనకు సఖ్యత ఏమాత్రం లేదని, ఇద్దరం ఒకేగదిలో ఉన్నప్పుడు అక్కడ మారణాయుధాలేం లేకుండా చూసుకోవాల్సివచ్చిందని ఘాటైన కామెంట్లే చేసింది. దాంతో నాగచైతన్య కూడా విడాకుల విషయంలో స్పందిస్తాడని, సమంతకు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తాడని అంతా అనుకొన్నారు.
అనుకొన్నట్టుగానే ఇప్పుడు విడాకులపై ఎదురవుతున్న ప్రశ్నల్ని చైతూ పక్కన పెట్టడం లేదు. కాకపోతే చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విడాకుల ప్రస్తావన వస్తే... ``ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఇప్పటికీ సమంతపై నాకు గౌరవం ఉంది.
తన సినిమాలు కూడా చూస్తుంటా`` అని చాలా కూల్ గా సమాధానం చెప్పాడు. ఒకే విషయంపై ఒకరి గురించి మరొకరు చేసిన వ్యాఖ్యల్లో ఎంత తేడా ఉందో అనిపిస్తోంది. తెర వెనుక ఏమైనా జరిగి ఉండొచ్చు. చైతూ దాన్ని మర్చిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. సమంత మాత్రం - ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు పెద్దది చేస్తూ, జనం దృష్టిలో చైని దోషిగా నిలెబట్టాలన్న పంతంతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. చైతన్య మాత్రం ఈ వ్యవహారాన్ని ఇప్పటికీ సున్నితంగానే డీల్ చేస్తున్నాడు. ''విడాకుల తరవాత నేనిప్పటి వరకూ మూడు సినిమాలు చేశా. ప్రతిసారీ ప్రమోషన్లలో సమంత తో విడాకుల విషయాన్నే అడిగి ఇబ్బంది పెడుతున్నారు. నాక్కూడా విసుగ్గానే ఉంది'' అని బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.