పూజా హెగ్దే చూడగానే కవ్వించే ఫిజిక్ ఈ ముద్దుగుమ్మది. తొలి సినిమా 'ముకుందా'లో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఇటీవల వచ్చిన 'డీజె - దువ్వాడ జగన్నాధమ్'లో గ్లామర్‌లో శృతి మించేసింది. గీతలు దాటేసింది. బికినీ సొగసులతో హీటెక్కించేసింది. ఇంతకీ ఈమె ఫిజిక్ ఇంత స్లిమ్‌గా అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మడు చేసే యోగాసనాలేనట. కావాలంటే మీరూ చూడండి ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా చేసిన ఈ ఫీట్‌ని.
శాంతం చేతుల మీద తన అందమైన బాడీని రివర్స్‌లో నిలబెట్టేసింది. ఇలా చేయడానికి ఈ ముద్దుగుమ్మకి సంవత్సరం పాటు కష్టపడి శిక్షణ తీసుకోవాల్సి వచ్చిందట. ఏ సపోర్ట్ లేకుండా చేతుల మీద ఇంత స్ట్రెయిట్‌గా శరీరాన్ని బ్యాలెన్స్ చేయడమంటే మాటలా మరి. ఫిట్‌నెస్ కోసం ఎంత కష్టానికైనా సై అంటానంటోంది ఈ బ్యూటీ. మొత్తానికి కష్టపడి సాధించింది.
సోషల్ మీడియాలో ఈ ఫోటో చూసి నెటిజన్లు వావ్ పూజా ఇది నువ్వేనా అని ఆశ్చర్యపోవడమే వారి వంతవుతోంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.