'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'కి భానుమతి ర్యాగింగ్‌

మరిన్ని వార్తలు

నాని కొత్త సినిమా 'ఎంసీఏ' టీజర్‌ విడుదలైంది. మరోసారి నాని ఖాతాలో హిట్‌ పడిపోయినట్లే అని సర్టిఫికెట్‌ తీసేసుకున్నాడు టీజర్‌ రాకతో నాని. 'ఎంసీఏ' అంటే అదేమైనా క్వాలిఫికేషనా? అంటే కాదు మైండ్‌ సెట్‌ అంటూ స్టార్ట్‌ చేసి, మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి అంటే ఏంటో నాని చెప్పిన విధానం ఆట్టుకుంటోంది. నేచురల్‌ యాక్టర్‌ కదా. అందుకే నాని నోటితో చెబితే, ప్రతీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి రియల్‌గా ఫీలవుతున్నాడు ఈ డైలాగ్‌ని. బాగా కనెక్ట్‌ అయిపోయింది.

'షర్ట్‌ బటన్‌ ఊడిపోతే ఎప్పుడైనా పిన్నీస్‌ పెట్టి మేనేజ్‌ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి టోర్న్‌ జీన్స్‌ అని కలరింగ్‌ ఇచ్చావా? అంతెందుకు అలా రోడ్డుపై వెళుతూ బస్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఫ్యామిలీ ఫోటోని ఊహించుకున్నావా? ఇవన్నీ చేస్తే తెలిసేది ఎంసీఏ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని..' నాని డైలాగ్‌ చెబుతుంటే వారెవ్వా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి అనాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. టీజర్‌లో కనిపించింది రెండు సీన్లే, చెప్పింది ఒక్కటే డైలాగ్‌. 'నువ్వు నాకు బాగా నచ్చావ్‌.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌..' అని.

కొంచెం ర్యాగింగ్‌ మోడ్‌లో సాయి పల్లవి నోట వచ్చిందీ మాట. ఆ డైలాగ్‌తోనే టీజర్‌ని మొత్తం హైలైట్‌ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తేనే ఆ సినిమా సూపర్‌ హిట్‌. ఇక ఇద్దరు నేచురల్‌ స్టార్ట్స్‌ ఒకర్ని ఒకరు డామినేట్‌ చేసుకుంటే ఇంకేముంది. కెవ్వు కేకే. అదే ఇప్పుడు 'ఎంసీఏ' సినిమా ద్వారా జరగనుంది. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యంగ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. డిశంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS