DJ చిత్రంలోని పాటలో నమకం, చమకం మాటల వల్ల ఏర్పడిన వివాదానికి తెరపడినట్టయింది.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం, నమకం మరియు చమకం బదులుగా నా గమకం నీ సుముఖం అనే రెండు పదాలని చేర్చారట. ఇప్పటికే ఈ పాట లిరిక్స్ మార్చడానికి జాప్యం జరుగుతుంది అన్నట్టుగా కొన్ని బ్రాహ్మణ సంఘాలు మళ్ళీ ఫిర్యాదులు చేయడంతో ఈ వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.
మొత్తానికి ఈరోజుతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక బన్నీ కూడా పూజా హెగ్డే తో కలిసి దువ్వాడ జగన్నాధం సంబందించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.
సో.. కాంట్రవర్సీ ముగిసింది.. రిలీజ్ మిగిలింది..