అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా.. పుష్ష. ఈ సినిమా గురించి ఓ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకీ, ఎన్టీఆర్ జీవిత కథకీ సంబంధం ఉందన్నది లేటెస్ట్ న్యూస్.
ఎన్టీఆర్ జీవితం గురించి తెలియంది కాదు. ఎన్టీఆర్ మనవడే అయినా... బాల్యంలో కుటుంబానికి దూరంగా పెరిగాడు. హరికృష్ణ కొడుకే అయినా, రెండో భార్య సంతానం కావడంతో, ఆదరణకు నోచుకోలేదు. ఎలాగైనా సరే, అందరితోనూ సెహభాష్ అనిపించుకోవాలని, కష్టపడ్డాడు.. పైకి ఎదిగాడు. సూపర్ స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్ స్టార్ అయ్యకే.. అందరూ పట్టించుకోవడం మొదలెట్టారు. నందమూరి వారసుడిగా ఒప్పుకోగలిగారు. సేమ్ టూ సేమ్.. పుష్షలో కథానాయకుడిగా పాత్ర తీరు కూడా ఇంతేనట. హీరో.. రెండో భార్య కొడుకని, తనని ఎవరూ పట్టించుకోరని, అందుకే అడవుల్లో పెరుగుతాడని, తనకంటూ ఓ స్థాయి వచ్చాక.. కుటుంబానికి దగ్గరవుతాడని తెలుస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో కాదో తెలీదుగానీ, ఇది గనుక నిజమైతే... ఎన్టీఆర్ కథని పుష్ష కోసం కాపీ కొట్టినట్టే.