ఒకప్పుడు సినిమాలకు మహిళలే మహారాణీ పోషకులు. వాళ్లకు నచ్చితే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయేది. అందుకే అప్పట్లో 'కోడలు దిద్దిన కాపురం, ;పుణ్యస్త్రీ, ఆడదే ఆధారం, పెళ్ళాం చెబితే వినాలి' వంటి సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోతున్నారు. వాళ్ళను థియేటర్లకు రప్పించడం కష్టమైపోతోంది. అందుకే ఇప్పుడు ఫిలిం మేకర్స్ అంటా యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. అయితే.. సీనియర్ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాత్రం మహిళలను మెప్పించడం కోసం 'భార్య దేవోభవ' పేరుతో ఓ సినిమా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
గతంలో 'అదిరిందయ్యా చంద్రం, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' వంటి కామెడీ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డికి ఇటీవలకాలంలో సరైన హిట్స్ లేవు. ఆయన తాజా చిత్రం 'రాగల 24 గంటల్లో' మాత్రం ఫరవాలేదనిపించుకుంటోంది. ఆ ఉత్సాహంలో 'భార్య దేవోభవ' చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. ఇక హీరో పదిమంది హీరోయిన్లు ఈ చిత్రంలో ఉంటారని అంటున్నాడు. మరి ఈ చిత్రం ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి. సత్యదేవా, ఈషా రెబ్బా నటించిన 'రాగల 24 గంటల్లో' ఈవారంలో విడుదలైన చిత్రాల్లో కాస్త మెరుగైన వసూళ్లు సాధిస్తోంది!!