కుక్కే కదా అని లైట్‌ తీసుకుంటే

మరిన్ని వార్తలు

కన్నడ హీరోయిన్‌ పారుల్‌ యాదవ్‌ని ఓ కుక్క దారుణంగా కరిచేసింది. తీవ్రగాయాలతో ఆమె ఆసుపత్రి పాలైంది. దాంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందట. తలలో కుక్క పళ్ళు రెండు సెంటీమీటర్ల మేర గుచ్చుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. రాంగోపాల్‌ వర్మ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ముంబయ్‌ నగరంలోని సోమేశ్వర్‌ రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పారుల్‌ యాదవ్‌ ముద్దుగా పెంచుకునే తన పెంపుడు కుక్కని సరదాగా ఈవినింగ్‌ వాక్‌కి తీసుకెళ్లింది. అక్కడి వీధి కుక్కలు, పారుల్‌ పెంపుడు కుక్కపై దాడి చేయబోయాయి. దాంతో ఆమె తన పెంపుడు కుక్కని రక్షించే యత్నంలో వాటిని తరమడానికి ప్రయత్నించగా, ఆ వీధికుక్కలు ఈ ముద్దుగుమ్మపై ఒక్కసారిగా దాడికి దిగాయి. వీధికుక్కలతో పెట్టుకుంటే అంతేగా మరి. ఒక్క కుక్క బారి నుండి తప్పించుకోవడమే అసాధ్యమైన చర్య. అలాంటిది నాలుగైదు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేస్తే ఇంకేమైనా ఉందా. ఆమె సుకుమారమైన శరీరాన్ని వాటి భయంకరమైన పళ్లతో తీవ్రంగా గాయపరిచాయి. ఆ పరిస్థితిలో ఆమె చెల్లెలు శీతల్‌ యాదవ్‌ ఈ పరిస్థితిని గమనించి, అక్కడి కొందరు స్థానికుల సహాయంతో ఆ కుక్కల బారి నుండి అక్కని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. అందుకే ఆఫ్ట్రాల్‌ కుక్కే కదా అని లైట్‌ తీసుకోవద్దు సుమీ!

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS