'దొరసాని' సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ శివాత్మిక రెండో సినిమా షురూ చేసింది. రాజశేఖర్ తనయగా ఇండస్ట్రీకి పరిచయమైన శివాత్మిక తొలి సినిమాకే నటనలో మంచి మార్కులు వేయించుకుంది. సినిమా అన్ని వర్గాల్నీ ఆకట్టుకోకపోయినా, శివాత్మిక తన అప్పియరెన్స్‌తో ఓ మోస్తరు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రంగమార్తాండ' సినిమాలో శివాత్మక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. హీరోయిన్గా రెండో అవకాశం ఇటీవలే దక్కించుకుంది.
దుర్గా నరేష్ గుట్ట అను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. 'గరుడవేగ', '24 కిస్సెస్' తదితర చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న అదిత్ అరుణ్, శివాత్మిక జంట ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ ఈ రోజు ఫిలిం నగర్ టెంపుల్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి 'విధి విలాసం' అనే క్లాసిక్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు.