విజయ్‌ దేవరకొండ సినిమా ప్రారంభం!

మరిన్ని వార్తలు

పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు ముంబయ్‌లో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 'ఫైటర్‌' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తుండగా, బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా నిర్మాణ భాగస్వామ్యం అందిస్తున్నారు. మార్షల్‌ ఆర్స్ట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో పూరీ మార్కు ఆటిట్యూడ్‌లోకి మారిపోయాడు మన రౌడీ.

 

సినిమా కోసం గత కొన్ని నెలలుగా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్‌ సరసన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ నటించనుందని ప్రచారం జరిగింది. అయితే, డేట్స్‌ అడ్జస్ట్‌ కాని కారణంగా జాన్వీ ప్లేస్‌ని బాలీవుడ్‌ నటితోనే రీ ప్లేస్‌ చేయాలని అనుకుంటున్నారు పూరీ అండ్‌ టీమ్‌. ఆ క్రమంలో హీరోయిన్‌గా అనన్య పాండే పేరు తాజాగా తెర పైకి వచ్చింది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హీరోయిన్‌ అనన్య పాండే మోస్ట్‌ పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళ విజయ్‌తో అనన్య జోడీ కుదిరితే, టాలీవుడ్‌లోనూ ఆమె పేరు మార్మోగిపోతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS