నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీయాలంటే ఒక్కటే భయం. జనాలు థియేటర్‌కి వస్తారా, లేదా? అని. సినిమా బాగుంది అన్న టాక్ వచ్చినా సరే - థియేటర్లకు కదిలి రావడానికి ఇబ్బంది పడుతుంటారు ప్రేక్షకులు. సమంత 'యూ టర్న్' అందుకు అతి పెద్ద ఉదాహరణ. ఈ సినిమాకి రివ్యూలు బాగానే వచ్చినా వసూళ్లు మాత్రం రాలేదు. ఆ భయంతోనే `ఓ బేబీ`లో నటించింది సమంత.
అయితే... ఓ బేబీ మాత్రం అటు విమర్శకుల ప్రశంసల్నీ, ఇటు బాక్సాఫీసు దగ్గర వసూళ్లనీ బాగానే రాబట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈచిత్రానికి తొలి రోజు మంచి వసూళ్లే అందాయి. మౌత్ టాక్ వల్ల శని, ఆదివారాలు ఆ వసూళ్లు మరింత పెరిగాయి. తొలి మూడు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 8 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో 2.26 కోట్లు తెచ్చుకున్న ఈ చిత్రం, ఓవర్సీస్ లో 2.10 కోట్లు సాధించింది. కృష్ణ, గుంటూరు, సీడెడ్‌లలో వసూళ్లు నిలకడగా ఉన్నాయి. తొలి రోజు ఏ, బీ సెంటర్లలో బేబీ హవా కనిపించింది. సీ సెంటర్లు బాగా స్లోగా మొదలయ్యాయి. అయితే ఆదివారం నాటికి సీ సెంటర్లలోనూ బేబీ హవా మొదలైపోయింది.