సందీప్ కిష‌న్‌.... ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ!

మరిన్ని వార్తలు

మంచి క‌థ దొరికితే, మంచి పాత్ర ల‌భిస్తే - ఏ న‌టుడికైనా, న‌టికైనా అంత‌కంటే ఆనందం మ‌రోటి ఉండ‌దు. పాత్ర న‌చ్చితే పారితోషికాలు త‌గ్గించుకోవ‌డానికి సైతం సిద్ధ‌మే అని హీరో, హీరోయిన్లు చెబుతుంటారు. కానీ ఈ మాట‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టేది చాలా త‌క్కువ మంది. సందీప్ కిష‌న్ మాత్రం ఈ జాబితాలో త‌ప్ప‌కుండా ఉంటాడు. సందీప్ ఇప్ప‌టి వ‌ర‌కూ 24 సినిమాలు చేస్తే అందులో ప‌ద్నాలుగు చిత్రాల‌కు అస్స‌లు పారితోషిక‌మే అందుకోలేద‌ట‌.

 

క‌థ, పాత్ర న‌చ్చ‌డంతో, కొన్ని సినిమాల్ని ఎలాగైనా స‌రే, ప‌ట్టాలెక్కించాల‌న్న ఉద్దేశంతో పారితోషికం తీసుకోకుండా న‌టించాన‌ని అంటున్నాడీ యువ హీరో. ''నలుగురూ మనల్ని గుర్తించాలని ఏ నటుడైనా అనుకుంటాడు. నేనూ అలానే అనుకున్నా. ఆ గుర్తింపుని కూడా దక్కించుకున్నాను. ఒంటికి గాయాలైనా లెక్క చేయలేదు. ఇప్పటి వరకూ 14 సినిమాలు ఫ్రీగా చేసుంటాను. నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవడం లేదు. ఆ కథలు నచ్చడంతోనే డబ్బులు తీసుకోకుండా నటించాను.

 

‘సినిమా హిట్టయితే డబ్బులిస్తాం’ అని నిర్మాతలు చెప్పారు. అందులో సగం ఫ్లాప్‌ అయ్యాయి. సగం మంది ఎగ్గొట్టారు. బ‌డ్జెట్ ఎక్కువ‌వుతుంద‌ని ప‌క్క‌న పెట్టాల‌నుకున్న కొన్ని క‌థ‌లు నేను పారితోషికం తీసుకోక‌పోవ‌డంతో ప‌ట్టాలెక్క‌గ‌లిగాయి. ఓ విధంగా ఇది కూడా నా స్వార్థ‌మే' అని చెప్పుకొచ్చాడు సందీప్‌. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన `నిను వీడ‌ని నీడ‌ను నేనే` ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. అన్న‌ట్టు ఈ చిత్రానికి నిర్మాత కూడా సందీప్ కిష‌నే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS