ఈ ఆగస్ట్‌లో నాగార్జున 'మన్మధుడు 2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమాని పట్టాలెక్కించాల్సి ఉంది. అయితే, మధ్యలో బుల్లితెరపై 'బిగ్‌బాస్' సీజన్ 3 కోసం హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఈ సీజన్ కోసం 'బంగార్రాజు' షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చిందట. దాంతో సంక్రాంతి సీజన్లో ఉండాల్సిన 'బంగార్రాజు'ను సమ్మర్ సీజన్‌కి షిఫ్ట్ చేసేశారట.
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా సంక్రాంతికి విడుదలై తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణాన్ని నింపి, బాక్సాఫీస్‌కి కాసుల గలగలతో కళాకాంతులు తీసుకొచ్చింది ఆ ఏడాది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో దానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న 'బంగార్రాజు'ను కూడా సంక్రాంతి సీజన్లోనే విడుదల చేయాలనుకున్నాడట నాగ్. కానీ, 'బిగ్‌బాస్' సీజన్ కోసం ఆ సీజన్‌ని త్యాగం చేయాల్సి వచ్చిందట.
ఇక ఎప్పుడయితే 'బిగ్‌బాస్'కి సంబంధించి టీజర్ రిలీజైందో, అప్పటి నుండీ బుల్లితెరపై బిగ్‌బాస్ గ్లామర్ తళుకులీనింది. ఈ నెల 20 నుండి బిగ్‌బాస్ మూడో సీజన్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. దీంతో పాటు, ఆయన తాజా చిత్రం 'మన్మధుడు 2' ప్రమోషన్స్ కూడా వేగం పుంజుకున్నాయి. సో నాగార్జునకు డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఓ వైపు సినిమా ప్రమోషన్, ఇంకో వైపు బిగ్‌బాస్ ప్రమోషన్స్ వెరసి నాగార్జున ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.