ఏజెంట్ సాయి శ్రీ‌నివాస 'నాని'!

మరిన్ని వార్తలు

కొత్త ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. త‌న దృష్టి ఇప్పుడు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు స్వ‌రూప్‌పై ప‌డింది. 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌'తో ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నాడు స్వ‌రూప్‌. ఈ సినిమా నానికి బాగా న‌చ్చింది. ఇప్పుడు స్వ‌రూప్‌తో క‌ల‌సి ప‌నిచేద్దామ‌ని ఫిక్స‌య్యాడు. 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌'కు సీక్వెల్ త‌యారు కానున్న‌ద‌ని అందులో నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని స‌మాచారం అందుతోంది.

 

ఇటీవ‌ల నాని స్వ‌రూప్‌ల మ‌ధ్య భేటీ జ‌రిగింద‌ట‌. `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌'కు సీక్వెల్ క‌థ త‌న ద‌గ్గ‌ర సిద్ధంగా ఉంద‌ని స్వరూప్ చెప్ప‌డంతో ఈ కాంబినేష‌న్‌కి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌ 'లో న‌వీన్ పొలిశెట్టి క‌థానాయ‌కుడిగా న‌టించాడు. న‌వీన్ కూడా ఈసినిమాలో ఓ హీరోగా న‌టిస్తాడ‌ని, ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తెర‌కెక్క‌బోతోంద‌ని తెలుస్తోంది. సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌కు ప‌నిచేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఈ సినిమాకి కూడా వ‌ర్క్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS