రాజమౌళి సినిమా అంటే ఓ పట్టాన తెమిలే వ్యవహారం కాదు. ఏళ్లకు ఏళ్లు సెట్స్‌లోనే గడుపుతుంటారు. తీసిందే తీసి... తీసిందే మళ్లీ తీసి - ఇలా పర్ఫెక్షనిజం చూపించుకుంటుంటారు. అందుకే ఆయన సినిమాలు ఆలస్యం అవుతూ వస్తాయి. విడుదల తేదీ ప్రకటించడం, దాన్ని వాయిదా వేయడం - రాజమౌళికి అలవాటే. RRR విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అక్టోబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించేశారు. పోస్టర్లు, మేకింగ్ వీడియోలలోనూ ఇదే డేట్ కనిపించింది. దాంతో.. అక్టోబరు 13న నిజంగానే ఈ సినిమా వచ్చేస్తుందని అనుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మళ్లీ అనుమానంలో పడిందని టాక్.
RRR షూటింగ్ ఓ షెడ్యూల్ బాకీ ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులుంటాయి. ఇవన్నీ బేరీజు వేసుకుంటే.. అక్టోబరు 13న ఈ సినిమా సిద్ధం కావడం కష్టమంటున్నాయి డ్రేడ్ వర్గాలు. అక్టోబరు దాటితే... సంక్రాంతి వరకూ మంచి డేట్లు ఉండవు. సంక్రాంతికి ఇప్పటికే రిలీజ్ డేట్లు ఖాయం చేసుకున్నాయి కొన్ని సినిమాలు. వాటి మధ్యన ఎట్టిపరిస్థితుల్లోనూ RRR రాదు. కాబట్టి ఈ సినిమా 2022 వేసవికి వెళ్లిపోతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరి రాజమౌళి విజన్ ఎలా ఏందో ఏమిటి? నిజంగా RRR వేసవికి షిఫ్ట్ అయిపోతే... అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్టే.