డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోటీ.

By Gowthami - May 13, 2020 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళ సినిమాల‌పై తెలుగు సినిమా మ‌రోసారి ఫోక‌స్ పెట్టింది. అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్.. రైట్స్ ఇప్ప‌టికే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చేతిలో ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ సినిమాపై ఎప్పుడో తెలుగు నిర్మాత‌లు దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా కోసం విప‌రీత‌మైన పోటీ ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాత ఇప్ప‌టికే డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. ఆయ‌న‌కు ఇద్ద‌రి ముగ్గురి నుంచి పోటీ ఎదురైంది.

 

సాధార‌ణంగా మ‌ల‌యాళ రీమేక్ లు రూ2. నుంచి 3 కోట్ల‌లోపు కొనేయొచ్చు. కానీ డ్రైవింగ్ లైసెన్స్‌రీమేక్ కోసం రూ.4 నుంచి 4.5 కోట్లు వెచ్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర క‌థానాయ‌కుడు డ్రైవింగ్ లైసెన్స్‌రీమేక్ చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ట‌. ఆయ‌న కోసం నిర్మాత‌లు ఈ సినిమా రైట్స్ కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒకేసారి ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌ల నుంచి రీమేక్ రైట్స్ కోసం ఫోన్ కాల్స్ రావ‌డంతో.. స‌ద‌రు మాతృక తీసిన నిర్మాత మ‌రీ మొండికేస్తున్న‌ట్టు వినికిడి. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS