అసలే ఈమధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ సెన్సిటీవ్ గా తయారయ్యారు. బన్నీని, తన సినిమాల్ని ఒక్క మాటన్నా ఊరుకోవడం లేదు. ఏకంగా ట్రోలింగ్స్ మొదలెట్టేస్తున్నారు. పోయి పోయి ఆ ఫ్యాన్స్ తోనే పెట్టుకున్నాడు బండ్ల గణేష్. ఇటీవల సోషల్ మీడియాలో బండ్ల మంచి యాక్టీవ్ గా ఉంటున్నాడు. సినిమా - పొలిటికల్ కామెంట్లు దంచి కొడుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో `డీజే ఫ్లాపు` అని పరోక్షంగా చెప్పాడు. దాంతో బన్నీ ఫ్యాన్స్‌ని కెలికినట్టైంది. ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గురించి కాస్త నెటిటీవ్ గా మాట్లాడాడు గణేష్. గబ్బర్ సింగ్ ఛాన్సు తన వల్లే వచ్చిందని, హరీష్‌కి రీమేక్ సినిమాలు తప్ప, స్ట్రయిట్ సినిమాలు తీసి హిట్టు కొట్టడం రాదని తేల్చేశాడు.
హరీష్ తీసిన సినిమాల్లో దువ్వాడ జగన్నాథమ్ ఒకటి. అది స్ట్రయిట్ సినిమానే. అంటే.... బండ్ల దృష్టిలో ఆ సినిమా హిట్టు కానట్టే కదా? పైగా `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` కూడా హరీష్ తీసిన స్ట్రయిట్ సినిమానే. దాన్నీ బండ్ల ఫ్లాపుల లిస్టులో కలిపేసినట్టే కదా? ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తే, మెగా ఫ్యాన్స్ హర్టవుతారు కదా. మెగా ఫ్యాన్స్ పవర్ తెలిసి కూడా.. వాళ్లతో ఎందుకు పెట్టుకున్నాడో??